తెలంగాణలోని కంటైనర్ స్కూళ్లకు ఏఐసీసీ కితాబు.. పోస్టు వైరల్!

-

తెలంగాణలోని ములుగు నియోజకవర్గంలో గల బంగారుపల్లిలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైన కంటైనర్ స్కూళ్లకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కితాబు ఇచ్చింది. ములుగులోని అటవీ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో కంటైనర్ పాఠశాలలు,ప్రాథమిక వైద్య కేంద్రాలను మంత్రి సీతక్క ఏర్పాటు చేయించారు.

ఇప్పటికే రెండు స్కూల్స్,ఒక ఆస్పత్రి అందుబాటులోకి వచ్చాయి. ఈ కంటైనర్ స్కూల్ సక్సెస్ స్టోరీని ‘ఎక్స్’ వేదికగా ఏఐసీసీ ఓ వీడియో పంచుకుంది. ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ సర్కార్‌లో విరబూసిన విద్యా హక్కు చట్టం అంటూ పేర్కొంది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ ప్రజాపాలన అందించాలని ఆకాంక్షించింది.ఈ మేరకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఉన్న వీడియోను పోస్ట్ చేయగా.. దేశానికి రోల్ మోడల్‌గా ములుగు కంటైనర్ పాఠశాల నిలుస్తుందని మంత్రి సీతక్క సైతం ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news