చాలా శాతం మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ ఎన్నో కారణాల వలన ఆగిపోతూ ఉంటారు. ముఖ్యంగా సరైన రుణం అందకపోవడం వలన వ్యాపారాలను ప్రారంభించరు. ఎప్పుడైతే సరైన పెట్టుబడి ఉంటుందో అప్పుడు వ్యాపారాలు పెరుగుతాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల పథకాలను ప్రారంభించడం జరిగింది.
క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్:
ఎటువంటి హామీ లేకుండానే ఈ పథకం ద్వారా కేంద్రం ఎంఎస్ఎంఈల కు రుణాన్ని అందిస్తుంది. పైగా 85% గ్యారెంటీ కవర్ ను కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఐదు లక్షల వరకు లోన్ తీసుకుని 80% వరకు గ్యారెంటీ కవర్ ను పొందవచ్చు.
బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్ స్కీం:
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలను ఇస్తుంది మరియు దీని కోసం కార్పొరేషన్ బ్యాంకులతో ఒప్పందాలను కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంతో సులభంగా రుణాలను పొందవచ్చు.
సిడ్బీ మేక్ ఇన్ ఇండియా లోన్:
ఈ రుణం ద్వారా వ్యాపారాలను వెంటనే ప్రారంభించవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి తో పాటుగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, అనేక వసతులను అందించడం వంటివి కూడా ఈ పధకం లో భాగంగా అందచేస్తారు. పైగా దీనిలో రీపేమెంట్ పీరియడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
స్టాండప్ ఇండియా స్కీమ్:
ఈ పథకం ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రారంభించారు. ట్రేడింగ్, తయారీ, సర్వీసెస్ వంటి మొదలైన రంగాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రుణాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా పది లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు.
కనుక ఇటువంటి పథకాలను ఉపయోగించుకొని రుణాన్ని పొందడం ద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుబడి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా సొంతంగానే వ్యాపారాన్ని ప్రారంభించండి.