ప్రపంచంలోని వైవిద్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ లోని బర్దమాన్ లోని సాయ్ మైదానంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ మనం కేవలం హిందూ సమాజం పైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా అడుగుతారని అన్నారు. దీనికి సమాధానంగా దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదన్నా ఉందంటే.. అది కేవలం హిందూ సమాజమేనని తాను చెబుతానని పేర్కొన్నారు.
హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని పునరుద్ఘాటించారు. మంచి సమయాల్లోనూ సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందని.. దానికి సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత అవసరం అని అన్నారు. ప్రజలు దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులను గుర్తు పెట్టుకోరని.. తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేసిన రాజును గుర్తించుకుంటారని అన్నారు. 200 ఏళ్ల పాటు మన దేశాన్ని సాలించిన బ్రిటీషు వారు దేశ ప్రజలను విడదీయాలని చూసారన్నారు. స్థానిక ప్రజలు దేశాన్ని పరిపాలించడానికి పనికిరారని ప్రచారం చేసి.. భారతదేశ చరిత్రను బ్రిటీషు పాలకులు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.