ఏపీలో కొత్తగా ఆరు చోట్ల ఎయిర్ ఫోర్టులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం పై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్ ఫోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఆ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫిజిబిలిటి అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.1.92కోట్లను విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, ఒంగోలు, తాడెపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాలలో ఎయిర్ ఫోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జున సాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడం వద్ద 1,123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరం 787 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. నిధులను కేటాయించిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news