ఎయిర్ ఇండియా: దుబాయ్ కి ఎగరనున్న విమానాలు.. నేటి నుండే.

-

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇండియా నుండి దుబాయ్ వచ్చే విమానాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిషేధాన్ని విధించింది. ఏప్రిల్ 24న నిషేధం విధించిన దుబాయ్, తమ వద్ద నుండి ఇండియాకు విమాన సర్వీసులను ఆపివేసింది. ఐతే ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి చాలా వరకు తగ్గింది. కేసులు కూడా 50వేల దిగువకు వచ్చాయి. ఈ కారణంగా ఇప్పుడిప్పుడే భారతదేశ సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. ఇతర దేశాలకి వచ్చేందుకు అనుమతులు ఇస్తున్నారు.

తాజాగా దుబాయ్ కూడా తమ దేశానికి వచ్చేందుకు ఎయిర్ ఇండియా సర్వీసులకు అనుమతులు ఇచ్చింది. ఈ రోజు 10గంటల నుండి విమానాలు గాల్లో ఎగరనున్నాయి. ఈ మేరకు ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కాకపోతే ఈ ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారై ఉండాలి. అది కూడా దుబాయ్ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ అయి ఉండాలి. ఇంకా 48గంటల క్రితమే కరోనా నెగెటివ్ అన్న సర్టిఫికేట్ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version