ఎయిర్‌టెల్ ఆఫ‌ర్‌.. డిస్నీ+హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..!

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆ సంస్థ కొత్త‌గా రూ.401 బండిల్డ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు 3జీబీ డేటా వ‌స్తుంది. అలాగే ఏడాది కాలానికి గాను డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు కాగా ఇందులో ఎలాంటి ఉచిత కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను అందివ్వ‌డం లేదు.

కాగా ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌ను వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తోపాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇత‌ర డిజిట‌ల్ వాలెట్ల ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవ‌చ్చు. ఇక డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో డిస్నీ+ కంటెంట్‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే కిడ్స్ కంటెంట్‌, అన్‌లిమిటెడ్ లైవ్ స్పోర్ట్స్‌, మూవీలు వీక్షించ‌వ‌చ్చు.

ఇక ఎయిర్‌టెల్ తాజాగా లాంచ్ చేసిన రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2.5 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version