అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టార‌ర్ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే…

-

అక్కినేని కుటుంబంలో మూడో తరం నుంచి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున తనయులు అక్కినేని నాగ చైతన్య – అక్కినేని అఖిల్. అక్కినేని భవిష్యత్ స్టార్స్ గా అభిమానులు చూసుకుంటున్న ఈ ఇద్దరు అన్న‌ద‌మ్ములు ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోలేక పోతున్నారు. ఒక్క హిట్ కొట్టేందుకు వీరు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. నాగచైతన్య ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అవుతున్న ఏకంగా 10 ప్లాపులు ఇచ్చాడు. ఇక ఈ యేడాది భార్య స‌మంత‌తో చేసిన మ‌జిలీ సినిమాతో కాస్త ట్రాక్‌లోకి వ‌చ్చాడు.

ఇక అఖిల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అఖిల్ చేసిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అవడంతో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. మ‌నం సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ సినిమా కోసం అభిమానులే కాకుండా టాలీవుడ్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక స‌మాచారం లేక‌పోయినా అక్కినేని బ్ర‌ద‌ర్స్ మల్టీ స్టారర్ కు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.


ఆరెక్స్ 100తో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నయువ ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కె అవకాశాలు ఉన్నట్టుగా వినికిడి. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత అజ‌య్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకో అన్ని కుదిరాకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు తాను రెడీ చేసుకున్న క‌థ‌తో అక్కినేని ఫ్యామిలీతో మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం చైతు త‌న సినిమాల‌తో బిజీగా ఉంటే అఖిల్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, ఆ త‌ర్వాత ఐదో ప్రాజెక్ట్ కూడా ప‌ర‌శురాం డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి వీరి ప్రాజెక్టుల త‌ర్వాత ఇది సెట్స్ మీద‌కు వెళుతుందేమో ?  చూడాలి. గతంలో ఇదే ప్రాజెక్ట్ కోసం సమంతాను అడిగినట్టు  అప్పట్లో టాక్ రావడం గమనించాల్సిన అంశం.

Read more RELATED
Recommended to you

Latest news