ఇండియాకు పోలీస్ శాఖ వెన్నుముఖ లాంటిదని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ పేర్కొన్నారు. 52 సంవత్సరాల క్రితం ఇదే అకాడమీ నుండి ఐ పి ఎస్ గా వచ్చానని… ఐపీఎస్ గా తీర్చి దిద్దిన అకాడెమీ ఫ్యాకల్టీ కి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. నేడు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఐపీఎస్ అనే ట్యాగ్ లైన్ ఉంటుందని… 1948 నుండి దేశానికి 5700 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇచ్చింది ఈ అకాడమీ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా 21 లక్షల పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. 35 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్రం దశాబ్ద ఉత్సవం నాటికి భారత్ ఇంకా ఎంతో ముందు ఉంటుందని.. చాలా డిఫరెంట్గా ఇండియాను చూడబోతున్నామన్నారు. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఎంతో సాధించామని… చేస్తున్న ప్రతి సేవ దేశం కోసమే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. 132 కోట్ల మంది ప్రజల భద్రతే మీ బాధ్యత కాదని.. భారతదేశపు 32 లక్షల చదరపు కిలోమీటర్లు ల బాధ్యత పోలీస్ లదేనని పేర్కొన్నారు. భారతదేశపు చివరి గీత పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుందని.. భారత దేశపు 15 వేల కిలోమీటర్ల భూమి పై నిరంతరం చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్ తో సమస్యలు వస్తూనే ఉన్నాయన్నారు.