చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ ఈ మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా ఇండియాలో ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశం లో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,516 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,37,416 కు చేరింది.
దేశంలో ఇంత తక్కువగా యాక్టివ్ కేసులు నమోదవడం 267 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.27 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 501 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంట ల్లో దేశ వ్యాప్తం గా 13, 155 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,38, 14, 080 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా…. 61.10 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే… రోజూ వారి… పాజిటివిటీ రేట్ 1.07 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 110.79 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
#Unite2FightCorona#LargestVaccineDrive
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/hcq8TTsfk4 pic.twitter.com/A1ue5OrgXE
— Ministry of Health (@MoHFW_INDIA) November 12, 2021