అకీరా గురించి సంచలన విషయాలు చెప్పేశాడు

-

కాచుకోండి.. తెలుగు తెరకు తిరుగులేని పొడుగు కుర్రాడు వచ్చేస్తున్నట్లే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పండగ చేసుకునే న్యూస్ గా దీన్ని చెప్పాలి. వారు ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోవటమే కాదు.. ఇకపై అకీరా సోత్త్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిన్నమొన్నటి వరకూ బుజ్జి బుజ్జిగా ఉన్న అకీరా కాస్త పెద్దోడయ్యాడనుకున్నారే కానీ.. ఇప్పటికిప్పుడు అకీరా ఎలా ఉన్నాడు?  ఏం చేస్తున్నాడు? ఎలా వ్యవహరిస్తాడు? అతని అలవాట్లు ఏమిటి?  అతని బిహేవియర్ ఎలా ఉంటుంది?  లాంటి డౌట్లకు సమాధానం చెప్పే వారే కనిపించరు.

Akira Nandan and Adivi Sesh were spotted together

తాజాగా సంచలన కథానాయకుడు కమ్ దర్శకుడు అడివి శేష్ చేసిన తాజా ట్వీట్ లో అకీరాకు సంబంధించిన ఆసక్తికర ముచ్చట్లను చెప్పేశాడు. తాజాగా తనను రేణూ దేశాయ్ ఇంటికి ఆహ్వానించటం.. ఈ సందర్భంగా పవన్-రేణు కుమారుడు అకీరా.. కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా సమయాన్ని గడిపిన వైనాన్నివెల్లడించాడు. ఈ సందర్భంగా అకీరా గురించి ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు అకీరా 6.4 అడుగుల ఎత్తులో ఉన్నాడని..  హ్యాండ్స్ మ్ కుర్రాడితో ఈ రోజు ఉత్సాహంగా గడిచిందన్నాడు. అతడికి ఎవరు సినిమా చాలా నచ్చిందని.. ఇద్దరం సరదాగా సమయాన్ని గడిపినట్లు ట్వీట్ చేశారు. ఇద్దరం భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నామని చెప్పిన శేషు.. గంభీరమైన స్వరంతో ఉన్న వ్యక్తి అతడు.. మా ఇద్దరికి ఎడమచేతి వాటం కావటం సంతోషంగా ఉందన్నాడు.

చాలా విషయాల్లో ఇద్దరికి కామన్ గా ఉన్నాయని చెప్పిన అడివి శేషు.. పవన్ కుమార్తె ఆద్య గురించి కూడా ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. ఆద్యకు కెమేరా అంటే సిగ్గు అని చెప్పాడు. రేణూ దేశాయ్ తో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. తనను వారింటికి పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ పోస్ట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version