మానాడు రీమేక్‌లో అక్కినేని హీరో!

-

ఇటీవ‌ల త‌మిళలో వ‌చ్చిన మానాడు మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ది లూప్ అనే పేరుతో విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల వ‌ద్ద‌కు చేర‌క‌పోయినా.. త‌మిళ‌లో మాత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కాగ ఇటీవ‌ల సోనీ లివ్ లో ఓటీటీలో విడుద‌ల అయిన ఈ సినిమా తమిళ‌తో పాటు తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంది. టైమ్ లూప్ ను బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. అయితే లూప్ పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ సినిమా రాక‌పోవ‌డంతో ప్రేక్షకులు కొంత వ‌ర‌కు క‌నెక్ట్ అయ్యారు. కాగ ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుంది.

మానాడు తెలుగు రీమేక్ రైట్స్ కోసం గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడ‌క్షన్స్ తీవ్రంగా శ్ర‌మించాయి. చివ‌రికి సురేష్ ప్రొడ‌క్షన్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను త‌మిళ మానాడు తెర‌కెక్కించిన వెంక‌ట్ ప్ర‌భుతోనే తెలుగులోనూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని సురేష్ ప్రొడ‌క్షన్స్ భావించిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైత‌న్య ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేక‌పోయినా.. త్వ‌ర‌లోనే సురేష్ ప్రొడ‌క్షన్ ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news