పెళ్లి అయిన రోజు నుంచి పిల్లల గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అక్కినేని నాగ చైతన్య, సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు సమంతకు చాలా ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయినా సరే సామ్ మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. అయితే తాను పిల్లలను కంటే సినిమాలకు దూరం అయిపోతానని ఇప్పటికే చెప్పేసింది సమంత. అయితే అదెప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. కాగా, సమంతకు తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న సామ్‌ను.. మీరు ప్రెగ్నెంటా అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. అవును నేను ప్రెగ్నెంట్.. 2017 నుంచి ప్రెగ్నెంటే.. కానీ బేబి మాత్రం బయటకు రావాలని కోరుకోవడం లేదని సమాధానం ఇచ్చింది.
దీంతో ఆ ప్రశ్న అడిగిన నెటిజన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇకపోతే 2017లో ఈ జంట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రైన సంగతి తెలిసిందే. ప్రపోజ్ చేసిన కొద్దిరోజులకే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ హార్దిక్ ప్రకటించాడు. ఇటీవల పండంటి మగ బిడ్డ కూడా పుట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా అనుష్క శర్మ గర్భవతి అని శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.