పోలీసులకు సీబీఐ లేఖ.. రియాకు పోలీసు ప్రొటెక్షన్..!

-

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటు బాలీవుడ్, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు ఎంత దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ కేసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేసింది. దీంతో రియా చక్రవర్తి వరుసగా రెండో రోజు సీబీఐ విచారణకు హాజరైంది.

ముంబైలోని డీఆర్‌డీవో గెస్ట్ హౌజ్‌లో ఉంటున్న సీబీఐ అధికారుల వ‌ద్ద‌కు ఇవాళ రియా వెళ్లింది. నిన్న జరిగిన విచారణలో రియాను సీబీఐ అధికారులు 10 గంటల పాటు విచారించారు. మరోవైపు రియాకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. దీంతో వారు రియాకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version