గాయం నుంచి కోలుకున్న అక్షర్.. రెండో టెస్టు తుది జ‌ట్టులో ఛాన్స్!

-

టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఇటీవ‌ల గాయాల పాలు అయిన స్టార్ అల్ రౌండ‌ర్ అక్షర్ ప‌టేల్.. ప్ర‌స్తుతం కోలుకున్నాడు. అంతే కాకుండా.. అక్షర్ ప‌టేల్ ను సెలెక్షన్ క‌మిటీ కూడా తిరిగి జ‌ట్టులోకి తీసుకుంది. కాగ అక్షర్ ప‌టేల్ కు బ్యాక‌ప్ గా ఎంపిక చేసిన కుల్ దీప్ యాద‌వ్ ను సెల‌క్షన్ క‌మిటీ.. జ‌ట్టు నుంచి విడుద‌ల చేసింది. దీంతో శ్రీ‌లంక తో ఈ నెల 12 నుంచి జ‌ర‌గ‌బోయే.. రెండో టెస్టు మ్యాచ్ కు అక్షర్ ప‌టేల్ అందుబాటులో ఉండ‌నున్నాడు.

అంతే కాకుండా ఈ టెస్టు మ్యాచ్ తుది జ‌ట్టులోనూ అక్షర్ ప‌టేల్ కు అవ‌కాశం వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. కాగ శ్రీ‌లంక తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్ లోని మొద‌టి టెస్ట్ మ్యచ్ లో టీమిండియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. టీమిండియా 574 ప‌రుగులు చేస్తే.. శ్రీ‌లంక రెండు ఇన్నింగ్స్ ల‌లో కేవ‌లం 174, 178 ప‌రుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది.

దీంతో శ్రీ‌లంక పై టీమిండియా 222 తో పాటు ఇన్నింగ్స్ తేడాతో విజ‌యం సాధించింది. ఆల్ రౌండ‌ర్ జ‌డేజా 175 ప‌రుగుల‌తో పాటు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ లో అక్షర్ ప‌టేల్ అందుబాటులో ఉంటే.. ఇద్ద‌రు క‌లిసి శ్రీ‌లంక ను ఊచ‌కోత కోయ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version