అక్షయ తృతీయ స్పెషల్: అక్షయ తృతీయ నాడు బంగారమే కాదు వీటిని కూడా కొనచ్చు…!

-

హిందువులకు అక్షయ తృతీయ శుభాన్ని తీసుకొస్తుంది. ఈ పవిత్రమైన రోజు నాడు ఏ పని చేసినా కూడా శుభం కలుగుతుందని హిందువుల నమ్మకం. చాలా మంది ఆరోజు పెట్టుబడి పెట్టడం బంగారం కొనడం ఇలా ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తూ వుంటారు. అక్షయ తృతీయ నాడు ఏమేమి కొనొచ్చు అనేది ఈ రోజు మనం చూద్దాం….!

 

ఈసారి అక్షయ తృతీయ మే 14న వచ్చింది. ఆరోజు బంగారం కొంటే ఎంతో మంచి కలుగుతుందని, శుభప్రదమని భావిస్తారు. బంగారం ఆ రోజు కొనుగోలు చేయడం వల్ల సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టుబడిగా పెట్టి, వ్యాపారం మొదలు పెడితే వ్యాపారం బాగుంటుందిట. అక్షయ తృతీయ నాడు బంగారం మాత్రమే కాదు కొత్త వాహనం కొనుగోలు చేసినా కూడా శుభప్రదం. అక్షయ తృతీయ నాడు వాహనం కొనుగోలు చేస్తే దీర్ఘాయువును ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు.

అదే విధంగా అక్షయ తృతీయ నాడు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇల్లు, స్థలం వంటివి కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని అంటారు. అదే విధంగా పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం భద్రత కోసం విద్యా ప్రణాళికను ప్రారంభించేందుకు గొప్ప రోజుగా అక్షయ తృతీయని పరిగణిస్తారు. అక్షరాభ్యాసం వంటివి కూడా ఈరోజు చేయడం శుభప్రదం.

Read more RELATED
Recommended to you

Exit mobile version