లివింగ్ రిలేష‌న్ షిప్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

-

లివింగ్ రిలేషన్ షిప్ పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వ్యక్తులతో సహజీవనం చేస్తున్న ఇద్దరు మహిళలు తమ జీవితాల్లో కుటుంబాలు జోక్యం చేసుకోవడం పై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు ఇచ్చింది. షరియా ఖాతూన్ అనే మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది.. అదేవిధంగా జీనత్ పర్వీన్ అనే ఓ మహిళ మీరట్ కు చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ ఇద్దరూ తమ జీవితాల్లో కుటుంబాలు జోక్యం చేసుకుంటూ ఉన్నాయంటూ వేసిన వేర్వేరు పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది.

న్యాయమూర్తులు ప్రిటింకర్ దివాకర్…అశుతోష్ శ్రీ వాస్తవ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పునిచ్చింది. పిటిషనర్లు తమ జీవితంలో తమ కుటుంబ సభ్యుల జోక్యంపై పోలీసులను ఆశ్రయించామని అయితే వారి నుండి ఎలాంటి సహాయం అందలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా వారి జీవితంలో ఉన్న స్వేచ్ఛ కూడా హరించిపోయిందని పేర్కొన్నారు. దాంతో రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద పొందుపరచబడిన జీవించే హక్కు అన్నింటికంటే గొప్పది అని ధర్మాసనం పేర్కొంది.

అంతేకాకుండా లివింగ్ రిలేషన్ షిప్ సంబంధాలు జీవితంలో భాగమయ్యాయని… అవి న్యాయ వ్యవస్థచే ఆమోదించబడ్డాయి అని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయస్థానం సాంఘిక నైతికత భావనల కంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే హక్కు నుండి వచ్చిన వ్యక్తిగత స్వయంప్రతిపత్తి ద్వారా ఉండే లివ్ ఇన్ రిలేషన్ షిప్ సంబంధాన్ని కాపాడటమే అవసరమని పేర్కొంది. పిటిషనర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news