జీ-20 సమావేశానికి ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

ఇటలీలో జరుగుతున్న 16వ జీ -20 సమావేశం కోసం ప్రధాన మోడీ ఇటలీకి వెళ్లారు. ఇటలీ దేశం రోమ్ లో నేటి నుంచి రెండు రోజుల పాటు జీ -20 సమావేశాలు జరుగనున్నాయి. గతేడాది సౌదీ అరేబియాలో జరిగిన జీ-20 సమావేశాలు నిర్వహించారు. కరోనా కారణంగా ఈ సమావేశాలు వర్చువల్ గా జరిగాయి. అంతకు ముందు 2019 లో ఒసాకాలో జరిగిన జీ-20 సమావేశాలకు చివరి సారిగా మోదీ హాజరయ్యారు. 

ప్రస్తుతం రెండేళ్ల తరువాత ఇటలీలో జరుగుతున్న సమావేశాలకు ప్రధాని నేరుగా హాజరవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా పాండమిక్ నుంచి రికవరీ, సమ్మిళిత అభివ్రుద్ది, గ్లోబల్ క్లైమెట్ మార్పులపై ప్రధాన మంత్రి మోదీ చర్చించనున్నారు. మరోవైపు ఇటలీ ప్రధాన మంత్రి మారియోడ్రాగి ఆహ్వానం మేరకు పోప్ ఫ్రాన్సిస్ ను కలిసే అవకాశం ఉందని విదేశాంగ శాఖ చెబుతోంది. ఈనెల 29-31 మధ్య పోప్ ఫ్రాన్సిస్ తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మోదీ గ్లాస్గో లో నవంబర్ 1-2 తేదీల్లో పర్యటించనున్నారు.