దేశంలో సహజీవనాలపై యువతీ యువకులకు ఎటువంటి అవగాహన ఉందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడో చాలా తక్కువ శాతం మంది మాత్రమే సహజీవనం ను ఒక పద్దతిలో వినియోగించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే వీటి వలన ఎక్కువ మొత్తంలో యువత పాడయిపోతోంది.. చిన్న వయసులోనే భవిష్యత్తును కోల్పోతున్నారు. తాజాగా ఈ సహజీవనమ్ కు సంబంధించిన ఒక కేసు పై అలహాబాద్ హై కోర్ట్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియాలోనే వివాహ వ్యవస్థను నాశనం చేసేలా సహజీవనాలు ఉన్నాయంటూ అలహాబాద్ హై కోర్ట్ పరిగణించింది. 19 సంవత్సరాల యువతి తన సహజీవన భాగస్వామి పై పెట్టిన కేసు పై విచారణ సందర్భంలో హై కోర్ట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. హై కోర్ట్ మాట్లాడుతూ… సీజన్ కు ఒక పార్టనర్ ను మార్చే ఈ సమాజం చాలా దారుణంగా మారుతోందంటూ బాధపడింది.
ఇటువంటి ఆలోచన మంచి సమాజానికి మంచిది కాదు అంటూ అభివర్ణించింది. ఈ అవసరం లేని సహజీవనాల వలన కలిగే నష్టాల గురించి తెలియకపోవడం వలెనే యువత ఇలా చేస్తోందంటూ చెప్పింది అలహాబాద్ హై కోర్ట్.