అదరగొడుతున్న ‘అలవైకుంఠపురములో’ ‘బుట్ట బొమ్మ’ సాంగ్……!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మూడవ కలయికలో రూపొందుతున్న క్రేజీ మూవీ అలవైకుంఠపురములో. మంచి ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటెర్టైనెర్ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మూడు సాంగ్స్, యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించడంతో పాటు అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ ని దక్కించుకున్నాయి.

అలానే అవి సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను కూడా మరింతగా పెంచేసాయి అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుండి బుట్ట బొమ్మ అనే పల్లవితో సాగె నాలుగవ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బాలీవుడ్ ఫేమస్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ సాంగ్ ఎంతో మెలోడియస్ గా సాగుతూ యువత హృదయాలను తాకుతోంది. ఈ సాంగ్ కు ఆకట్టుకునే ట్యూన్ ని సంగీత దర్శకుడు తమన్ అందించగా, వినసొంపైన సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి సమకూర్చడం జరిగింది.

హీరోయిన్ అందాన్ని గురించి హీరో పొగుడుతూ సాగె ఈ సాంగ్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే వ్యూస్ లభిస్తున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమేలు కూడా ఆల్రెడీ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందిస్తుండగా అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది….!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version