పాలకుడు ఒక్కడు సరైన వాడైతే.. చాలు ప్రజాధనానికి ఎలాంటి రక్షణ ఉంటుందో చెప్పడానికి! అవును.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఖజానాకు ఎలాంటి ఢోకాలేకుండా పోయిం దని అంటున్నారు సీనియర్ అధికారులు. ప్రతి పనికీ కూడా పారదర్శక విధానాన్ని అనుసరిస్తున్నారు. సుమారు ఏదైనా పని వంద కోట్ల రూపాయల బడ్జెట్ దాటితే వెంటనే దానిని జ్యూడీషియల్ రివ్యూకు తీసు కు వెళ్తున్నారు. అదేవిధంగా పారదర్శక టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఈ టెండర్లు, రివ్యూలు వంటివి ఏదో పెద్ద పెద్ద పోలవరం వంటి ప్రాజెక్టుల్లోనే కాదు.. ఏ చిన్నపనికైనా కూ డా జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ప్రజాధనం వృధా కాకుండాకాచుకుంటున్నారు. అదేసమ యంలో ప్రభుత్వంపై విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా కూడా ఏకకాలంలో అటు ప్రజలకు, ఇటు న్యాయ వ్యవస్థకు కూడా బాధ్యత వహించేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వమే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే.
అయితే, పిల్లల్లో పౌష్ఠికాహారం అందించే క్రమంలో అన్నంతో పాటు పప్పుచెక్కను(చిక్కీ) కూడా అందిం చాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏడాది పాటు విద్యార్థులకు రాష్ట్ర వ్యా ప్తంగా చిక్కీలు అందించేందుకు దాదాపు 136 కోట్లతో ప్రబుత్వం టెండర్లు పిలిచింది. అయితే, ఇదేదో వచ్చిన టెండర్లను వచ్చినట్టు పరిశీలించి ఖరారు చేయలేదు. పప్పుబెల్లాలే కదా? అని తేలికగా కూడా తీసుకోలేదు. దాఖలైన టెండర్లను న్యాయసమీక్షకు పంపి తద్వారా టెండర్లను ఖరారుచేయాలని జగన్ నిర్ణయించడంపై అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి చిన్నదే అని కూడా వదిలి పెట్టకుండా ప్రజా ధనానికి జగన్ పూచీ పడుతున్న తీరును వారు కొనియాడుతున్నారు.