ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డులను వాడేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపిన వారికి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాంతో వీటి వినియోగం నానాటికి పెరుగుతూ వస్తుంది.కాగా, ప్రతి నెల క్రెడిట్ కార్డు రూల్స్ మారుతున్న సంగతి తెలిసిందే… ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. లక్షలాది మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లను ప్రభావితం చేసే నియమనిబంధనలు ఇవి. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, ఇన్ యాప్ ట్రాన్సాక్షన్స్ ఇలా ప్రతీ ట్రాన్సాక్షన్‌ను కొత్త రూల్స్ ప్రభావితం చేస్తాయి. మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము..
ఓటీపీ..
క్రెడిట్ కార్డ్ సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేస్తే సరిపోదు. కార్డ్ యాక్టివేట్ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా కార్డ్ హోల్డర్ల సమ్మతి తీసుకోవాలి. అయితే కార్డ్ జారీ చేసిన 30 రోజుల్లో కస్టమర్ కార్డ్ యాక్టివేట్ చేయకపోతే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ కస్టమర్ నుంచి సమ్మతి రాకపోతే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలి. కస్టమర్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 7 వర్కింగ్ డేస్‌లో కార్డును బ్లాక్ చెయ్యాలి.
క్రెడిట్ కార్డ్ లిమిట్..
క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగిందా..లేదా తగ్గిందా అనేది ఇక మీదట ఇకపై ఇలా జరగదు. మీ క్రెడిట్ లిమిట్ పెంచాలంటే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థ మీ నుంచి సమ్మతి తీసుకోవాలి. అంటే కస్టమర్ సమ్మతి లేకుండా క్రెడిట్ లిమిట్ పెంచకూడదు. క్రెడిట్ లిమిట్ పెంచే అవకాశం ఉందని కార్డ్ హోల్డర్‌కు తెలియజేసి, కస్టమర్ సమ్మతి తీసుకొని లిమిట్ పెంచాలి..
టోకెనైజేషన్ రూల్స్..
టోకెనైజేషన్ రూల్స్ క్రెడిట్ కార్డులతో పాటు డెబిట్ కార్డులకు కూడా వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్లు, సీవీవీ లాంటి వివరాలు ఇ-కామర్స్ సైట్లలో సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా టోకెనైజ్ చేస్తే చాలు. అంటే మీ కార్డ్ నెంబర్ బదులు టోకెన్ క్రియేట్ అవుతుంది. మీ కార్డ్ నెంబర్ ఇ-కామర్స్ సైట్లలో ఉండదు. అక్టోబర్ 1 నుంచి కార్డ్ టోకెనైజేషన్ తప్పనిసరి..లేకుంటే ప్రతి సారి నెంబర్ మొదలగు వివరాలాను పొందుపరచాలి..
ఇవి కాకుండా క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, పన్నులు, చక్రవడ్డీ, మినిమమ్ అమౌంట్ డ్యూ లాంటి వివరాలన్నీ కస్టమర్‌కు సక్రమంగా వివరించాలి…ఇందుకు సంబంధించిన కొత్త రూల్స్ ఇవే..