మార్చి 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి. కనుక లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్స్ తప్పక వాటిని తెలుసుకోవాలి. ఈ బ్యాంక్ 2020 నవంబర్‌లో డీబీఎస్‌లో బ్యాంక్‌లో విలీనం అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఇప్పటి వరకు చెల్లుబాటు అయ్యాయి. కానీ మార్చి 1 నుంచి అవి చెల్లవు. కొత్తవి అమలులోకి వస్తాయి. కనుక బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
మీరు కనుక రేపటి నుండి నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ వంటి మార్గాల్లో డబ్బులు పంపాలంటే కచ్చితంగా కొత్త డీబీఎస్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ ఉపయోగించాలంటే పక్కా మీకు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ తెలిసి ఉండాలి. డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది.
అదే విధంగా పాత చెక్ బుక్స్ మీ దగ్గర ఉంటే కూడా మార్చుకోండి. ఎంఐసీఆర్ కోడ్ మారుతుంది కనుక కొత్తవి తీసుకోండి. పాతవి చెల్లవు. 2021 నవంబర్ 1 నుంచే కొత్త చెక్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. అప్లై చేసుకోండి.
లేదు అంటే మీరు కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేసి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్ బుక్ కోసం అప్లై చెయ్యచ్చు. అలానే ఈ కొత్త వారిని ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, డీమ్యాట్ అకౌంట్ వంటి వాటిల్లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసుకుని సమస్యలు రాకుండా వుండండి.