మీరు ప్రాణాలతో ఉండాలంటే మాదేశం విడిచిపోండి… రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడి వార్నింగ్

-

మీరు ప్రాణాలతో ఉండాలంటే ఉక్రెయిన్ ని విడిచి వెళ్లాలని రష్యన్ ఆర్మీకి వార్నింగ్ ఇచ్చాడు ఉక్రెయిన్ ప్రెసిడెండ్ జెలెన్ స్కీ. మేము అంతా పోరాట యోధులమని ఆయన అన్నారు. మరోవైపు రష్యాతో యుద్ధానికి సిద్ధంగా ఉండి.. సైనిక అనుభవం ఉన్న ఖైదీలు ముందుకు వస్తే ఆయుధాలు అందిస్తామని జెలన్ స్కీ ప్రకటించారు. యుద్ధానికి సిద్ధంగా ఉంటే… ఖైదీలను విడుదల చేస్తామని అన్నారు. యూరోపియన్ యూనియన్ లో వెంటనే సభ్యత్వం కల్పించాలని జెలన్ స్కీ కోరారు. 

మరోవైపు ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు బెలారస్ లో చర్చల్లో పాల్గొననున్నారు. అయితే చర్చలకు ముందు ఉక్రెయిన్ని రష్యా బలగాలు విడిచిపోవాలని, కాల్పులను ఆపాలని షరతులు విధించింది. ఉక్రెయిన్ దేశం నాటోలో చేరకూడదనే లిఖిత పూర్వక హమీ ఇవ్వాలని రష్యా షరతు విధించింది. ఇదిలా ఉంటే బెలారస్ బోర్డర్ లో ఉన్ ఫ్యాఫిట్ లో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version