తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్..ఈ టిప్స్ పాటిస్తే జాబ్ గ్యారెంటీ..

-

తెలంగాణాలో వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాల్లు ఎగ్జామ్స్ లో కొన్ని టిప్స్ పాటిస్తే మంచి స్కొర్ చెయ్యడం పక్కా..ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసినవాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులను స్కొర్ చెయ్యవచ్చు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉంటాయి. వీటిని చదవడంతో మంచి మార్కులు సాధించుకోవచ్చని ఆయన అన్నారు. ఇంతకు ముందు మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో భాగంగా అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దానికి ధీటుగా ఇప్పుడు హిస్టరీ సబ్జెక్టు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని అన్నారు.

మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో ఏ విధంగా అయితే ఎక్కువ బిట్స్ వస్తాయో అదే విధంగా హిస్టరీ సబ్జెక్టులో కూడా 50 కి పైగా బిట్లు రావడం జరుగుతుంది. అందువల్ల హిస్టరీ సబ్జెక్టును కూడా క్షుణ్ణంగా చదివినట్లయితే ఈజీగా మార్కులను సంపాదించవచ్చనన్నారు.గతంలో ఎస్సై కానిస్టేబుల్ పరీక్షలో డైరెక్ట్ బిట్స్ అడిగేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రింది వానిలో సరియైనవి ఏవీ, క్రింది వానిలో జతపరుచుము.. అన్నటువంటి ఇన్ డైరెక్ట్ ప్రశ్నలు రావడం జరుగుతుంది.

ఇండియన్ హిస్టరీలో ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అనే మూడు భాగాలు ఉంటాయి. ప్రాచీన యుగం మధ్యగంలో కంటే ఆధునిక యుగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఆధునిక యుగం చదవడంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మంచిది అని ఆయన అన్నారు. ఆధునిక యుగం నుంచి 12 నుండి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.. కానిస్టేబుల్ పరీక్షకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ బుక్స్ తెలంగాణ ప్రభుత్వం చే ప్రచురించబడినటువంటి అకాడమీ పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి..

ఎస్ఐ పరీక్షకు డిగ్రీ వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన అకాడమీ పాఠ్యపుస్తకాలను చదవవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు చరిత్ర నుంచి 50కి పైగా బిట్స్ రావడం జరుగుతుంది. కావున మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో భాగమైనటువంటి ఆర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ తో పాటు,ప్యూర్ మ్యాచ్ కి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తామో.. అదే విధంగా హిస్టరీకి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా చదవడం వలన ఈజీగా మార్కులు సంపాధించవచ్చు. హిస్టరీ సబ్జెక్టులో తెలంగాణ హిస్టరీ గురించి క్షుణ్ణంగా చదివినట్లయితే మంచి మార్కులు వస్తాయి.

మొదటిసారి ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలు నెగటివ్ మార్క్స్ పెట్టడం జరిగింది. కావున తెలిసినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ఉత్తమం. సరైన సమాధానం తెలిస్తేనే జవాబు ఇవ్వాలి. ఏదో ఒకటి అని మనం సమాధానం ఇవ్వడం వల్ల వచ్చినటువంటి మార్కుల నుంచి మైనస్ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది…అందుకే తెలిసిన వాటికి మాత్రమే టచ్ చేస్తే బెస్ట్..ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version