ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు మేలు జరగాలి : బొత్స

-

వ్యవసాయ సంక్షోభంపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం. విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం. విత్తనాలు.. ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం. మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది.

మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు. వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమే. అధికారుల దగ్గర ఆత్మహత్యలు చేసుకున్న రైతుల లెక్కలు ఉన్నాయి. మీ హయంలో పెండింగ్ లో ఉన్న చెల్లింపులు కూడా మేం వచ్చాక చేశాం.. ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు మేలు జరగాలి అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version