తెలంగాణలోని పలు ప్రాంతాలలో నేడు ఉదయం నుంచి మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా మరికొన్ని ప్రాంతాలలో జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం లోపు చాలా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కరీంనగర్, హైదరాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్, హనుమకొండ, జనగాం, ఆసిఫాబాద్, మేడ్చల్, కొమరం భీమ్, మహబూబ్ నగర్, నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగకూడదని సూచనలు జారీ చేశారు. కాగా, మరో రెండు నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.