కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ వెనుక ఉన్న హరీష్ రావు అలాగే జోగినిపల్లి సంతోష్ ను ఉద్దేశించి బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. కాలేశ్వరం కేసులో కేసీఆర్ను ఇరికించేందుకు…. హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్, మెగా సంస్థ కుట్రలు పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత.

హరీష్ రావు అలాగే జోగిని పల్లి సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని… చంద్రశేఖర రావు ను ఇరికించేందుకే పెద్ద స్కెచ్ వేశారని బాంబు పేల్చారు. కాలేశ్వరం రిపోర్టు విషయంలో సిబిఐ కి కేసు అప్పగిస్తే తెలంగాణ బంద్ పిలుపునివ్వరా? అ0టు గులాబీ నేతల పై మండిపడ్డారు. తన తండ్రి కెసిఆర్ దాకా కేసు వచ్చినా కూడా.. గులాబీ పార్టీ నేతలు… చీమ కుట్టినట్లు వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత తీవ్ర విమర్శలు
కేసీఆర్ కు మరకలు అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ ఎంపీ, మేఘా కృష్ణా రెడ్డి పాత్ర ఉంది
కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక చెడ్డ పనులు చేయడం వల్లే కేసీఆర్ కు ఈ పరిస్థితి… pic.twitter.com/YP5j80IaWn
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025