మీకు ఈ బ్యాంక్స్ లో ఎకౌంట్ వుందా…? అయితే మీకు ఒక ముఖ్యమైన సమాచారం. అది ఏమిటంటే తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో PNB, ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ICICI ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చారు.
ఈ మూడు బ్యాంకులలో ఏ బ్యాంక్ లో అయినా ఖాతా ఉంటే తప్పక దీనిని తెలుసుకోండి. నేటి కాలం లో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ముఖ్యగా ఆన్ లైన్ లో ఎంతో మంది ఫ్రాడ్స్ కి పాల్పడుతున్నారు. దీని మేరకు ఖాతాదారులను బ్యాంకులు అప్రమత్తం చేస్తున్నాయి.
ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి అని తప్పక జాగ్రత్తగా ఉండాలని ఈ బ్యాంకులు ట్విట్టర్ వేదికగా కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంది.
ఎప్పుడైనా ఎవరైనా మీకు క్యూఆర్ కోడ్ షేర్ చేస్తే వాటి తో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఫేక్ ఫోన్ కాల్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలని మరియు కీలకమైన బ్యాంక్ వివరాలను ఎవ్వరికీ చెప్పొద్దూ అని బ్యాంక్ తెలిపింది. సీవీవీ, పాస్‌వర్డ్, ఓటీపీ, పిన్, కార్డు నెంబర్ వంటి వివరాలను రహస్యంగా ఉంచుకోవాలని చెప్పింది.