ఇప్పటి వరకు గాయాల కారణంగా ఫీల్డ్ లో 12 మంది క్రికెటర్లు మరణించారు వాటి వివరాల్లోకి వెళితే…
ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా, 25) – 2014
దక్షిణ ఆస్ట్రేలియా మరియు న్యూ సౌత్ వేల్స్ మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ జరిగినప్పుడు బౌన్సర్ కారణంగా తలపై బాల్ తగిలింది. దీనితో మెదడు లో ఫ్రాక్క్చర్ అయ్యింది అలానే మెదడులో భారీ రక్తస్రావం అవ్వడం తో సిడ్నీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసారు. రెండు రోజుల తరువాత హ్యూస్ దీని కారణంగా మరణించాడు.
డారిన్ రాండాల్ (దక్షిణాఫ్రికా, 32) – 2013
దక్షిణాఫ్రికా దేశీయ మ్యాచ్ లో రాండాల్ ఫుల్ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బాల్ తలకు తగిలింది. వెంటనే ఆసుపత్రికి తీసికెళ్లారు కాని అతను దెబ్బతో మరణించాడు.
జుల్ఫికర్ భట్టి (పాకిస్తాన్, 22) – 2013
దేశీయ ఆట సమయంలో ఈ పాకిస్తాన్ ఆటగాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి ఛాతీకి తగిలి నేల మీద పడిపోయాడు. ఆసుపత్రికి తీసికెళ్తే చనిపోయినట్లు చెప్పారు.
రిచర్డ్ బ్యూమాంట్ (ఇంగ్లాండ్, 33) – 2012
బ్యూమాంట్ గుండె పోటు తో మైదానంలో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసికెళ్తే మరణించినట్లు చెప్పారు.
ఆల్క్విన్ జెంకిన్స్ (ఇంగ్లాండ్, 72) – 2009
ఇంగ్లీష్ అంపైర్ జెంకిన్స్ ఒక లీగ్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నప్పుడు ఒక ఫీల్డర్ విసిరిన బంతి తలపై తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తరువాత అతను కోలుకోలేకపోయాడు.
వసీం రాజా (పాకిస్తాన్, 54) – 2006
పాకిస్తాన్ క్రికెటర్ వసీం రాజా బకింగ్‌హామ్‌షైర్‌లో ఆడుతున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.
రామన్ లాంబా (ఇండియా, 38) – 1998
ఇండియా డాక లో జరిగిన క్లబ్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు లాంబా తలకు తగిలింది. కోమాలో మూడు రోజులు వుంది తరువాత మరణించాడు.
ఇయాన్ ఫోలీ (ఇంగ్లాండ్, 30) – 1993
వర్కింగ్‌టన్‌కు వ్యతిరేకంగా డెర్బీషైర్‌కు జరిగిన దేశీయ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫోలే కంటి కింద బంతి తగిలింది. ఆ తరువాత ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.
విల్ఫ్ స్లాక్ (ఇంగ్లాండ్, 34) – 1989
గాంబియాలోని బంజుల్‌లో జరిగిన దేశీయ మ్యాచ్‌లో స్లాక్ కుప్పకూలి మరణించాడు. మరణానికి కారణం ఏమిటా అనేది డాక్టర్లకి తెలియలేదు.
అబ్దుల్ అజీజ్ (పాకిస్తాన్, 18) – 1959
కరాచీలో జరిగిన దేశీయ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అజీజ్ ఛాతీపై తగలింది. ఆసుపత్రికి చేరుకునే లోగ మరణించాడు.
ఆండీ డుకాట్ (ఇంగ్లాండ్, 56) – 1942
లార్డ్స్‌లో జరిగిన ఆటలో డుకాట్ గుండెపోటుతో బాధ పడ్డాడు, ఆ తరువాత అక్కడ అతను కుప్పకూలి చనిపోయాడు.
జార్జ్ సమ్మర్స్ (ఇంగ్లాండ్, 25) – 1870
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సమ్మర్స్ తలపై తగిలింది. గాయానికి చికిత్స చేయక పోవడంతో చనిపోయాడు.