ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. అదే సమయంలో గెస్ట్ హౌస్ స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ ఘటనలో సునీత చేతికి పెచ్చు తగిలి గాయమైంది.
ఈ ఘటనలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి సర్పంచులు కూడా గాయ పడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.