బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమించుకొని, కొన్నేళ్లు డేటింగ్ చేసుకొని ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రెగ్నెన్సీయ్ వచ్చిన తర్వాత కూడా సినిమా ప్రమోషన్స్‌లో, ఈవెంట్స్‌లో పాల్గొంది. ఇటీవల అలియాభట్‌కి ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు.
ముంబైలోని రణ్‌బీర్ ఇంట్లో కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే అలియాభట్ సీమంతం నిర్వహించారు. అలియా, రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అయితే అలియా భట్ ఈ అక్టోబర్ నెల చివరి వారం నాటికి బిడ్డకు జన్మనిస్తుందని వైద్యులు వెల్లడించారని సమాచారం. వైద్యులు అలా చెప్పడంతో అలియా భట్, రణ్ బీర్ ఇప్పటికే ఆస్పత్రిని ఫైనలైజ్ చేసుకున్నారని టాక్. ఆ ఆస్పత్రికి రోజుకు 15,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారని తెలుస్తోంది. అలియా భట్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తక్కువ ఖర్చు ఉన్న ఆస్పత్రిలో పని చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. గిర్గావ్లో ఉన్న సర్ హెచ్.ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో అలియా భట్ పేరు నమోదు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా ద్వారా వెల్లడైంది.
అయితే పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి అయ్యారని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో అలియా భట్ బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని సినిమాలో కూడా అలియా భట్ నటిస్తున్నారు.