మనం ఏమి మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడితే ఎవరి మనోభావలు దెబ్బతింటున్నాయి అన్నది కాస్త ఇంగితంతో ఆలోచించి మాట్లాడాలి! పైగా పెద్దమనుషులుగా ఉన్నవారు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడు నోరిచ్చాడుకదా అని.. మీడియా మైకిచ్చిందికదా అని ఏదిపడితే అది మాట్లాడకూడదని బాబుకు సూచిస్తున్నారు క్రైస్తవులు!
టీడీపీ హయాంలో, బీజేపీ నేత మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాంతంలోనే ఒక రథం దగ్ధం అయిపోయినా.. హిందువుల మనోభావాలు అప్పటికి లేవు కాబట్టి అది పట్టించుకోలేదు! అది ఎందుకో టీడీపీ – బీజేపీలు బాగా రాసుకుపూసుకు తిరిగిన టైంలో జరిగింది కాబట్టి కనీసం పేపర్ లో సరైన కవరేజ్ కూడా రాలేదన్నమాట!! ఆ సంగతులు అలా ఉంటే… ఏపీలో దేవాలయాలపై దాడుల వెనుక మత మార్పిడుల ఎజెండా ఉందని చెప్పుకొస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అవును… ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న ఈ దాడుల వెనుక ఒక చీకటి ఎజెండా ఉందని.. మత మార్పిడులను పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు. సరిగ్గా ఇక్కడే ఈ మాటల్లో రెండు విషయాలపై బాబు స్పష్టత ఇచ్చారని అంటున్నారు క్రైస్తవులు!
ఒకటి… దేవాలయాల్లో ప్రమాధాలు జరిగితే, ఇంక వారంతా ఆ దేవుళ్లను నమ్మడం మానేసి క్రైస్తవ్యులుగా మారిపోతారు అని చెప్పడం! ఇంతకు మించిన అజ్ఞానం… తాను వేంకటేశుని భక్తున్ని అని గతకొన్ని రోజులుగా తెగ చెప్పేస్తున్న బాబుకు ఉంటుందా? దేవాలయాలపై దాడులకు మత మార్పిడులకు ఏమైనా సంబంధం ఉందా? బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టే బాబుకే తెలియాలి! ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు ఇవ్వడానికని కొండకెళ్లిన ముఖ్యమంత్రిని డీక్లరేషన్ పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం కదా… బలవంతపు మతమార్పిడి అంటే!!
ఇక రెండో విషయం… మతమార్పుడుల వల్ల జగన్ ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తున్నారని! ఇది మరో అజ్ఞానపు కామెంట్ అని అంటున్నారు క్రైస్తవులు + హిందువులు! అంటే… గత ఎన్నికల్లో చంద్రబాబుకు క్రైస్తవులు ఎవరూ ఓటు వేయలేదా? హిందువులు ఓటు వేయకుండానే జగన్ గెలిచారా? లేక క్రైస్తవులు తనకు వద్దు.. వారంతా ఎలాగూ జగన్ వైపే ఉన్నారు అని బాబు ఫిక్సయిపోయి స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారా?
నాయకుడిలో ప్రజలు కోరుకునేది క్రైస్తవుడా.. హిందువుడా.. ముస్లిం మతానికి చెందిన వ్యక్తా అని కాదు… సరైన నాయకుడా కాదా.. ప్రజల సమస్యలు అర్థం చేసుకునే ఆలోచన ఉన్న వ్యక్తా కాదా.. విజన్ ని పేపర్ లోనూ గ్రాఫిక్స్ లోనూ చూపించకుండా.. చేతల్లో చూపించగలడా లేదా.. సామాన్యుల బ్రతుకులు మార్చగలడాలేదా… అన్నది మాత్రమే చూసి ఓటు వేస్తారు… తమ సేవకుడిగా ఎన్నుకుంటారు!! అన్నింటికంటే ముఖ్యంగా నమ్మకమైన వ్యక్తా కాదా.. మాటమీద నిలబడేవాడా కాదా అన్నది ప్రజలు ఎక్కువగా చూసే లక్షణాలు తప్ప… మతాలో కులాలో కాదని బాబు గ్రహించాలని కోరుకుంటున్నారు ఏపీలోని అన్ని మతస్తుల వారు!!
-CH Raja