సుప్రీంకోర్టును ఆశ్రయించిన అఖిల భారత ముస్లిం బోర్డు

-

అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,15, 21, 44 ప్రకారం విడాకులు తీసుకోవడానికి వ్యక్తిగత చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా, అందరికీ ఒకే విధమైన చట్టాలను వర్తింపును కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అయిన అశ్విన్‌ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఏఐఎంపీఎల్‌బీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్‌ 13 లోని భావవ్యక్తీకరణ, ఆచారాల పాటించడంపై వ్యక్తిగత చట్టాలను పొందుపరచి దరఖాస్తుదారుడు మతాలు వాటికి అనుగుణంగా పాటించే తెగల విశ్వాసాన్ని కలిగి ఉండడని సమర్పించాలనుకుంటునట్టు ఉపాధ్యాయ పిటిషన్‌లో పేర్కొనాలని కోరుతూ పిటిషన్‌ వేసింది.

 

రాజ్యాంగ అసెంబ్లీకి వ్యక్తిగత చట్టం, ఆచారాల ఉపయోగం మధ్య తేడా గురించి తెలుసుకుని వ్యక్తిగత చట్టాన్ని మినహాయించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 13లో ఆచారాల వాడకాన్ని చేర్చాలని సలహా ఇచ్చింది. హిందువుల్లో వివాహం, విడాకులకు సంబంధించిన చట్టాలు ఏకరీతి కాదని దానివల్ల ఆచారాలు, పద్ధతులు శాసనాల ద్వారానే రక్షిస్తున్నారని బోర్డు తన అభ్యర్థన లో తెలిపింది. ఉపాధ్యాయ దాఖలుపై గత ఏడాది డిసెంబర్‌ 16న అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసు ఇచ్చింది.మతం, జాతి,లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ఎటువంటి పక్షపాతం లేకుండా విడాకుల చట్టాల్లో వైరుధ్యాలను తొలగించి పౌరులందరికీ ఏకరీతి చట్టాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ విజ్ఞప్తికి వివరణ కోరుతూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘విడాకుల వివక్షత ఉన్న ఆర్టికల్‌ 14, 15, 21, పౌరులందరికీ యూనిఫాం గ్రౌండ్స్‌ ఆఫ్‌ డివోర్స్‌ కోసం చేసే మార్గదర్శకాలను కార ణంగా చూపి చట్టాలను ఉల్లంఘించినట్టు కోర్టు ప్రకటించవచ్చు’ అని తెలిపింది. ఆర్టికల్‌ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా అవమానపరచే విధంగా చట్టాలతో వ్యవహరిస్తుండగా ఆర్టికల్‌ 14 పౌరులందరికీ చట్టం ముందు అందరూ సమానం అని హామినిస్తుంది. ఆర్టికల్‌ 21 జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్చ సంబంధించి ఆర్టికల్‌ 44 ఒకే విధమైన సివిల్‌ కోడ్‌ గురించి ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version