పరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్దానికి ప్యాంట్, షర్ట్ వేస్తే రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కూడా అవే అబద్దాలు చెబితే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై బురద జల్లారు. పొరపాటున నిజం చెప్పినా జనం నిన్ను నమ్మరు అని తెలిపారు.
బాధ్యతయుతంతో పదవీలో ఉన్న వ్యక్తి జవాబుదారితనంతో మాట్లాడాలి అన్నారు. రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఏప్రిల్ 01 నుంచి మార్చి 09 వరకు నయా పైసా కింద రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. మహిళా దినోత్సవం రోజు కూడా మహిళలకు అబద్దం చెబుతారా..? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. రూ.21 వేల కోట్లు అప్పు ఇస్తే.. శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.