IND Vs NZ : రాణించిన న్యూజిలాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

-

ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. ముఖ్యంగా తొలుత వరుణ్ చక్రవర్తి విలియం యంగ్ ని పెవిలీయన్ కి పంపాడు. ఆ తరువాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, విలియమ్సన్ కి పెవీలియన్ కి పంపించాడు. దీంతో కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ ను మిచెల్ (63) ఆదుకున్నాడు.

చివర్లో హార్దిక్ బౌలింగ్ లో  బ్రేస్ వెల్ 6 కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. విలువైన హాఫ్ సెంచరీ చేశాడు బ్రేస్ వెల్. న్యూజిలాండ్ బ్యాటర్లలో యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, విలియమ్సన్ 11, మిచెల్ 63, లాథమ్ 14, ఫిలిప్స్ 34, పరుగులు చేశారు. కెప్టెన్ శాంట్నర్ 8 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు.  భారత బౌలర్లలో షమీ 1, కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా 1 వికెట్లు తీశారు.  భారత్ టార్గెట్ 252 పరుగులు చేయాల్సి ఉంది. ఫైనల్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version