ఖమ్మం జిల్లా ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు ఆర్టీసి కార్మిక జెఎసి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు విపక్షాలు మద్దతు పలికాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లా బంద్ కు సంపూర్ణ మద్దతు పలికింది. శ్రీనివాస్ రెడ్డి మృతికి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసి డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు మౌనం పాటించారు.
అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తూ..ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేపట్టిన సమ్మె ఇవాళ్టితో తొమ్మిదవ రోజు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసి డిపోల ముందు కార్మికులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.