కేసీఆర్ నిర్ణయంపై అన్ని రాష్ట్రాలు ఆసక్తి…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్య౦లో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ సర్కార్ వారి కోసం పలు కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్చ్, ఏప్రిల్ మే నెలలకు గానూ ఇంటి అద్దె వసూలు చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా జీవో విడుదల చేసింది.

అద్దెలు చెల్లించలేదన్న కారణంతో ఎవరినీ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించరాదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక జీవో విడుదల చేసింది. ఇల్లు ఖాళీ చేయిస్తే వారు సరిహద్దులు దాటడం లేదా మరో ఊరికి వెళ్తారని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. 3 నెలల తర్వాత అద్దె బకాయిలను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఇంటి యజమానులకు సూచనలు చేసింది

బలవంతంగా అద్దెలు వసూలు చేసినట్లు, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులొస్తే ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు-1897, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్టు-2005 ప్రకారం శిక్షలు విధిస్తామని ప్రభుత్వం ఇంటి యజమానులను హెచ్చరించింది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలు, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇక ఇప్పుడు ఈ నిర్ణయంపై అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ లో దీన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణటక ప్రభుత్వాలు కూడా దీన్ని అమలులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాయి. వెంటనే దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు అమలు జరుగుతుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version