కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు టెర్రరిస్ట్ లు హతం

Join Our Community
follow manalokam on social media

జమ్మూ కాశ్మీర్‌ లో మరో మారు ఎన్ కౌంటర్ జరిగింది. జమ్మూలోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌ కౌంటర్‌ జరిగిందని జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు ఈ ఉదయం ప్రకటించారు. ఇక ఈ ఎన్‌ కౌంటర్‌ లో జమ్మూ కాశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఎస్పీఓ మహ్మద్‌ అల్తాఫ్ అనే ఆయన మృతి చెందగా.. మరో పోలీస్‌ అధికారి అహ్మద్‌ గాయపడ్డారని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

అలానే ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు గుర్తు తెలియని లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు బుద్గాం ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఇరువర్గాలకు కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.  

TOP STORIES

ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్...