కరోనా కొత్త స్ట్రైయిన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో డెప్యూటీ సీఎం ఆళ్ల నాని మంతనాలు జరిపారు. రాజమండ్రిలో ట్రేస్ అయిన కేసు విషయంలో నమూనాలను పుణేకు పంపనున్నట్టు మంత్రికి అధికారులు వివరించారు. రాజమండ్రిలో గుర్తించిన కరోనా బాధితురాలు ప్రయాణించిన రైలు బోగి నుంచి ఏపీలో ఇంకెవరైనా దిగారా..? అనే కోణంలో ఆరా తీయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. కరోనా కొత్త స్ట్రెయినుతో ప్రజల్లో ఆందోళన ఉందన్న నాని ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవన్నారు. అంతే కాక ప్రభుత్వం నిర్వహించిన టెస్టుల్లో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని ఆయన అన్నారు.
రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ కుమారునికి నెగెటీవ్ అని తేలిందని అలానే ఆ మహిళకు కరోనా పాజిటీవ్ వచ్చినా మామూలుగానే ఉందని పేర్కొన్నారు. రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ నమూనాలను పుణేకు పంపామని ఆ రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నామని అన్నారు. రాజమండ్రి మహిళ యూకే నుంచి వచ్చారు కాబట్టే అననమానాలు ఏర్పడ్డాయి అంతేనని ప్రజలెవరూ భయాందోళనలు చెందొద్దని అయన కోరారు. రాజమండ్రి మహిళ ఫస్ట్ క్లాస్ బోగిలో వచ్చినందున ఆమె మిగిలిన వారితో కాంటాక్టైన సందర్బాలు తక్కువేనని ఆయన పేర్కొన్నారు.