పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది. నేడు 11:30 గంటలకు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది.

గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో సృష్టంగా చెప్పాలని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీంతో నేడు తీర్పు వచ్చే అవకాశం ఉందని.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ… చివరకు కేసు వాయిదా పడింది. దీంతో మార్చి 4వ తేదీన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ జరుగనుంది.
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ మార్చి 4కు వాయిదా
- ఇవాళ్టి విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరు
- స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరడంతో మార్చి 4కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు