నదిలో స్నానం చేస్తుండగా కాళ్లదగ్గరకు వచ్చిన మొసలి.. జస్ట్ మిస్ (వీడియో)

-

నదిలో స్నానం చేస్తుండేటప్పుడు కొందరు ఎంజాయ్ మెంట్ ఫీలవుతుంటారు. ముందు వెనుక అస్సలు చూసుకోరు.నదిలోకి దిగగానే అందులోని బురద పైకి తేలడంతో వెనుకనుంచి ముందు నుంచి ఏం వస్తున్నాయో కూడా తెలీదు. నీళ్లలో విషసర్పాలు కూడా తిరుగుతుంటాయి.ఒక్కోసారి అవి దాడి చేసే ప్రమాదం లేకపోలేదు.

ఇలాగే నదిలో స్నానం చేస్తున్న వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, ఓ వ్యక్తి తన మిత్రులతో కలిసి నదిలో పడవపై షికారుకు వెళ్లారు.అనంతరం పడవ నుంచి నీటిలోకి దిగిన ఓ వ్యక్తి ఈత కొట్టాడు. కాళ్ల కింద ఏదో కదలిక రావడంతో ఏముందా?.. అని కాళ్లకు తగిలిన దాన్ని బయటికి తీసి చూడగా.. మొసలి నోరు తెరచి కనిపించింది.దాన్ని చూడగానే భయంతో దూరంగా విసిరేసి పడవలోకి ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.ఈ వీడియో వైరల్ అవుతుండగా..ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news