ఆ ఎమ్మెల్యే మంత్రుల కన్నా పవర్ ఫుల్…! 

-

ఆయన చెప్తే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ పని అయినా అవుతుంది… ఆయన ఆదేశిస్తే ఏ అధికారి అయినా సరే పని చేస్తారు… ఆయన మాటకు కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ విలువ ఉంటుంది… ఆయన వస్తున్నారు అంటే అధికారులలో కూడా ఒక భయం ఉంటుంది. తన నియోజకవర్గ౦లోనే కాదు… ఆయన సొంత జిల్లాలో ఏ పని చెప్పినా సరే జరుగుతుంది… ఆయనకు ఎదురు చెప్పే వారు గాని ఆయన్ను కాదు అనే వారు గాని ఎవరూ లేరు. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన ఎమ్మెల్యే… మంత్రులకు కూడా ఆయన అంటే అపార గౌరవం.

ఇంతకు ఆయన ఎవరు అనుకుంటున్నారా…? ఆయనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడు… జగన్ ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఆర్ధికంగా అండగా నిలిచిన నేతల్లో ఒకరు. జగన్ వెంట దాదాపు అన్ని జిల్లాలు తిరిగిన నేత ఆయన. 2014 ఎన్నికల్లో 12 ఓట్లతో విజయం సాధించిన ఆయన 2019 ఎన్నికల్లో కూడా విజయం సాదించారు. జగన్ కోసం ఎంత వరకు అయినా ఎక్కడి వరకు అయినా సరే వెళ్ళే సాహసం ఆయన చేస్తారు. సదావర్తి భూముల విషయంలో,

ఆయన చేసిన పోరాటం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇక ఆ తర్వాత జగన్ పై మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు అంటూ వ్యాఖ్యలు ఆయన కోర్ట్ లో కేసులు కూడా వేసారు. సుప్రీం కోర్ట్ వరకు వెళ్లారు. అయితే అనూహ్యంగా ఆయన కేబినేట్ బెర్త్ మాత్రం దక్కలేదు. ఇక రాజధాని ప్రాంత ఎమ్మెల్యే గా ఉన్న ఆయన… మంత్రులు అందరితో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నారు. లోకేష్ ని ఓడించడంతో ఆయనపై మంచి అభిప్రాయమే మంత్రులలో కూడా ఉంది.

దీనితో సమస్యలు అంటూ తన వద్దకు వచ్చిన వారిని ఆళ్ళ గుర్తిస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆయా శాఖల్లో పని అయిపోతుంది. సచివాలయంలో ఉండే అధికారులు అయినా సరే ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉండటంతో కొంత మంది మంత్రులు కూడా ఆయన చెప్తే చెయ్యము అనే పరిస్థితి లేదు. వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతీ పని వాళ్ళు చేస్తున్నారు. అధికారులు కూడా దాదాపుగా అంతే… ఇప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టేసారు… ” మంత్రి కాని మంత్రి గారు”

Read more RELATED
Recommended to you

Exit mobile version