వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడ రూరల్ అంబాపురంలో అగ్రిగోల్డ్ భూమిని ఆక్రమించుకున్నారని భూ కబ్జా ఆరోపణలు వెల్లువెల్తుతున్నాయి. 2022లో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సాయంతో అక్రమించుకున్న భూమిని జోగి రమేశ్ తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు చెబుతున్నారు.
మొత్తం 56 సెంట్ల భూమిని జోగి రమేశ్ అనుచరులు కబ్జా చేశారని అంటున్నారు. అంబాపురంలోని సర్వే నెంబర్ 87లో 2160 గజాల అగ్రిగోల్డ్ భూమి ఉండగా ఇందులోని భూమిలో జోగి రమేశ్ అనుచరులు తాజాగా నిర్మాణాలు చేపట్టారు.దీంతో బాధితులు రోడ్డెక్కారు. కబ్జాదారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.