కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ : పేర్ని నాని

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గొప్పల మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ‘‘గతంలో జగన్ ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో ఉందని తప్పుడు ప్రచారం చేశారు. కలెక్టరేట్ భవనాలన్నీ తనఖా పెడుతున్నారంటూ నానా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా పాఠాలు చెబుతారట!’’ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును ప్రమోట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించారని నాని ఆరోపించారు. ‘‘వారు చెప్పింది సంపద సృష్టిస్తారట, జగన్ అప్పులు తీర్చేస్తారట. కానీ ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి తీరుగా అప్పులు చేయడం జరగలేదు. బిల్డప్ బాబాయ్ చంద్రబాబు, చిన్న బిల్డప్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కథలే చెబుతున్నారు. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్టు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరో 44 వేల ఎకరాల భూమిని భద్రత పేరుతో తీసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే, రాష్ట్రాన్ని ఏదో వ్యక్తిగత వ్యాపారంలా మార్చేయాలనుకుంటున్నారేమో’’ అని విమర్శించారు. చివరగా, ‘‘ఓట్లతో మోసంచేసి మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. చంద్రబాబు ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఇది ప్రజల డబ్బుతో జరుగుతున్న లగ్జరీ పాలన’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news