వరంగల్ లోని ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా ఎల్కతుర్తికి సజావుగా చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రతీ రోజు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ వ్యతిరేక సభగా ప్రజలు భావించి స్వచ్చంధంగా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్పై ప్రజలు కసితో ఉన్నారు.. అందుకే బీఆర్ఎస్ సభను.. వారి సొంత సభగా ఫీలవుతున్నారు.. దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత ప్రజాధారణ ఉండదేమో అని అన్నారు. చరిత్రలో ఏ సభ లేనట్లుగా నిర్వహించి.. రికార్డులు బద్దలు కొడతామని జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.