తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినం అన్నారు అల్లు అరవింద్. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం నేపథ్యంలో అల్లు అరవింద్ స్పందించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు నిర్మాత అల్లు అరవింద్.
ఇక అటు టాలీవుడ్ కు కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు అక్కినేని నాగార్జున. తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సమంత, కేటీఆర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత…. సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున.