బట్టలు మార్చుకునే సమయం ఇవ్వరా? అంటూ పోలీసులపై బన్నీ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ తరునంలోనే…టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.
BNS118 (1) సెక్షన్ కింద అల్లు అర్జున్‌కు ఏడాది నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మరో BNS105 సెక్షన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే.. తనను అరెస్ట్ చేయడంపై పోలీసులను ఆగ్రహించారు అల్లు అర్జున్. మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం ఇవ్వరా… నన్ను అరెస్ట్ చేయడం తీసుకెళ్లడం తప్పు కాదు కానీ ఇలా బెడ్రూం లోపలికి వచ్చి అరెస్ట్ చేయడం మంచి విషయం కాదు అంటూ మండిపడ్డారు అల్లు అర్జున్.
బట్టలు మార్చుకునే టైమ్ కూడా మీరు ఇవ్వలేదు : అల్లు అర్జున్
నన్ను తీసుకెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు
కానీ బెడ్ రూం బయటికి వచ్చి తీసుకెళ్లడం తప్పు
ఐ థింక్ దిస్ ఈజ్ టూ మచ్….ఇది కరెక్ట్ కాదు
– పోలీసులతో హీరో అల్లుఅర్జున్ #AlluArjun #Pushpa2TheRule #Bigtv pic.twitter.com/EUg2n7aG8i
— BIG TV Breaking News (@bigtvtelugu) December 13, 2024