అల్లు అర్జున్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ తరునంలోనే…టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. BNS118 (1) సెక్షన్ కింద అల్లు అర్జున్‌కు ఏడాది నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మరో BNS105 సెక్షన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
కాగా, టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. అల్లు అర్జున్ కోర్టులో హాజరు పరుస్తామని ప్రకటించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్.