Pushpa: ‘పుష్ప‌’రాజ్ కు కొత్త చిక్కు. షాక్ ఇవ్వ‌నున్న‌ స్పైడర్ మాన్!

-

Pushpa: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.


అయితే.. ప్ర‌స్తుతం పరిస్థితుల్లో తెలుగు మూవీ మేక‌ర్స్ ఏ సినిమాతో ఏ సినిమాను పోటీగా రిలీజ్ చేయ‌డానికి సిద్దంగా లేరు. ఇదే ప‌ద్ద‌తిని పుష్ప మూవీ మేక‌ర్స్ ఫాలో అయ్యారు. ఇత‌ర సినిమాల నుంచి పోటీ లేకుండా.. ఇత‌ర సినిమాల‌కు పోటీగా మార‌కుండా.. వేరే సినిమాల క్లాష్ నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ప్ర‌ధానంగా రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ , యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధ్యేశామ్ లాంటి సినిమాలకు పోటీ నుంచి కాస్త దూరంగానే ఉన్నారు..

ఇక సేఫ్ జోన్ లో ఉన్నాంలే అనుకుంటున్నారు.. ఇంత‌లోనే అనుకోని కొత్త చిక్కు పుష్ప రిలీజ్ అడ్డంకీ గా మారింది. టాలీవుడ్ లో ఎలాంటి పోటీ లేకుండా సేఫ్ గానే ఉన్నా.. హాలీవుడ్ లో మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. స‌రిగ్గా.. పుష్ప రిలీజ్ అవుతున్న అదే రోజు( డిసెంబర్ 17) న‌.. హాలీవుడ్ మూవీ స్పైడర్ మేన్ కూడా రిలీజ్ కాబోతోంది.

అల్లు అర్జున్ కేరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా పుష్ప తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం మీద‌నే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బ‌న్నీ. ఈ చిత్రం కోసం సుకుమార్ తన శ‌క్తియుక్తుల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించారు. ఏ మాత్రం త‌గ్గేదేలే అన్నట్టుగానే భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చివ‌ర‌లో ఆడెడ్ అట్రాక్షన్ గా సమంతను రంగంలోకి దించారు. త‌నతో ఓ ఐటెం సాంగ్ చేస్తున్నారు. పక్కా మాస్ క్యారెక్టర్ లో బన్నీ మనసు పెట్టి చేసిన ఈమూవీ.. ఎటువంటి పోటీ లేకుండా డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకుంటే.. ఇప్పుడూ స్పైడర్ మాన్ భారీ షాక్ ఇవ్వబోతోంది.

పుష్ప పాన్ ఇండియా మూవీకి టాలీవుడ్ లో గానీ, ఇటు మాలీవుడ్ లోకానీ ఎలాంటి నష్టం ఉండ‌క‌పోవ‌చ్చు.
కాని హిందీ, తమిళ మార్కెట్లలో స్పైడర్ మాన్ గట్టిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. గ‌తంలో స్పైడర్ మాన్ ఇండియాలో కూడా భారీ కలెక్షన్స్ వ‌సూల్ చేసిన దాఖాల‌లు ఉన్నాయి. మరి బన్నీ ఏం చేస్తాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version