ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు ప్రపంచాన్ని శాసించాడు. అంతలా సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే అలాంటి అల్లు అర్జున్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ నటించిన బోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తీస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఆరు పాటలుగా రిలీజ్ చేస్తారట. అయితే ఇందులో అల్లు అర్జున్ కు అర్జునుడి పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అట్లితో సినిమా కోసం ముంబై కి వెళ్ళిన అల్లు అర్జున్ ను అమీర్ ఖాన్ టీం కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ కు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కాగా కృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్ నటించిన బోతున్నట్లు తెలుస్తోంది.